బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై తీవ్ర దుమారం చెలరేగింది. అటు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ.. ఇటు అసెంబ్లీలోనూ పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. ఇక సర్వే తర్వాత 65 లక్షల ఓట్లను తొలగించి శుక్రవారం ఓటర్ల జాబితాను వెల్లడించింది. సెప్టెంబర్ ఒకటి వరకు ఓటర్లు అప్లై చేసుకోవచ్చని.. సెప్టెంబర్ నెలాఖరుకు తుది జాబితాను ప్రకటిస్తామని ఈసీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Raghunandan Rao: హిందువులను టెర్రరిస్టులుగా యూపీఏ ప్రభుత్వం చూపించింది..
అయితే తాజాగా ఈసీ విడుదల చేసిన జాబితాలో తన పేరు లేదని.. తాను ఎలా పోటీ చేయాలంటూ తేజస్వి యాదవ్ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. స్వయంగా బూత్ లెవల్ అధికారి తన దగ్గరకు వచ్చి ఫామ్ తీసుకెళ్లారని.. అయినా కూడా జాబితాలో పేరు లేదని ఆరోపించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 20 వేల నుంచి 30వేల వరకు ఓటర్లను తొలగించారని పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంలో దాదాపు 65 లక్షల ఓటర్లను తొలగించారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Pemmasani Chandrasekhar: ఆధారాలు దొరకగానే బిగ్ బాస్ అరెస్ట్..! లిక్కర్ స్కామ్‌పై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
అయితే తేజస్వీ యాదవ్ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ముసాయిదా జాబితాలో పేరు ఉందని పేర్కొంది. తేజస్వీ యాదవ్ బహుశా తన పాత ఈపీఐసీ నంబరుతో చెక్ చేసుకుని ఉంటారని, అందుకే ఆయన పేరు జాబితాలో కన్పించకపోయి ఉండొచ్చని ఈసీ తెలిపింది.
ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల కసరత్తు చేస్తోంది. అక్టోబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికల జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేస్తు్న్నారు.
