Site icon NTV Telugu

Ratan Tata: ఔదార్యంలో రతన్ టాటాకు సాటి లేరు.. చివరకు వంటవాడికి కూడా రూ. 1 కోటి..

Ratan Tata

Ratan Tata

Ratan Tata: రతన్ టాటా, భారత దేశం ఉన్నంత కాలం ఈ పేరు చిరస్మరనీయంగా ఉంటుంది. అంతటి సేవా గుణానికి ప్రతీక. దేశం పారిశ్రామికంగా వృద్ధి చెందేందుకు అనేక చర్యలు తీసుకున్న పారిశ్రామికవేత్త. గతేడాది చనిపోయిన రతన్ టాటా ఔదార్యం మరోసారి వెల్లడైంది. తన వీలునామాలో రూ. 3800 కోట్ల ఆస్తిని దాతృత్వానికి ఇచ్చారు. ఆస్తుల్లో సింహభాగాన్ని ఛారిటీలకు కేటాయించారు. మిగిలిన దానిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, జంతువుకు చెందేలా వీలునామా రాశారు. రతన్ టాటాకు రూ. 10 వేల కోట్ల ఆస్తులు ఉండగా, రూ. 3800 కోట్లను దానధర్మాలకే వినియోగించారు.

Read Also: Kesineni Nani: వక్ఫ్ బోర్డుల్లో ఇతర మతస్థులను చేర్చడం ఆమోదయోగ్యం కాదు..

రతన్ టాటా గతేడాది అక్టోబర్ 09 మరణించారు. ఆయన వీలునామా తాజాగా వెలుగులోకి వచ్చింది. తన ఆస్తిలో చాలా ఎక్కువ భాగాన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్‌లకు కేటాయించారు. షేర్లు, ఇతర పెట్టుబడులు, ఆస్తులు దాతృత్వానికే చెందుతాయని వీలునామాలో పేర్కొన్నారు. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్స్ మొత్తం రూ. 800 కోట్లలో మూడోవంతును తన సవతి తల్లి కుమార్తెలైన షరీన్ జేజీబాయి, డియాన్నా జేజీబాయికి రాశారు. రూ. 800 కోట్లలో మూడో వంతును టాటా మాజీ ఉద్యోగి, అత్యంత ఆప్తుడైన మోహిని ఎం దత్తాకు ఇచ్చారు.

తన ప్రాణ స్నేహితుడైన మోహ్లీ మిస్త్రీకి అలీబాగ్‌లో ఇంటిని, మూడు తుపాకులను ఇచ్చారు. తన పెంపుడు జంతువుల కోసం ఆయన రూ. 12 లక్షలు కేటాయించారు. తన వద్ద ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేసిన శంతను నాయుడికి ఇచ్చిన ఎడ్యుకేషన్ లోన్‌ని మాఫీ చేశారు. పొరుగింటి వ్యక్తి జేక్ మాలైట్ కు ఇచ్చిన వడ్డీ లేని రుణాన్ని మాఫీ చేశారు. ఇదిలా ఉంటే తన వద్ద పనిచేసని వంటవాడిని కూడా రతన్ టాటా మరిచిపోలేదు. తనకు ఎప్పటి నుంచో వండిపెడుతున్న కుక్ రజన్ షాకు రూ. 1 కోటి ఇచ్చాడు. ఇంటి పనులు చేసే సుబ్బయ్యకు రూ. 66 లక్షలే, సెక్రటరీ డెల్నాజ్‌కి రూ. 10 లక్షలు ఇవ్వాలని వీలునామాలో పేర్కొన్నాడు.

Exit mobile version