Ratan Tata: టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొన్ని వర్గాల బుధవారం ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపాయి. 86 ఏళ్ల టాటా సోమవారం వయో సంబంధిత అనారోగ్యంతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Read Also: AAP: ఆప్ సంచలన ప్రకటన.. ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడి
అయితే, రతన్ టాటా హెల్త్ అప్డేట్స్‌పై టాటా ప్రతినిధి స్పందించలేదు. మరోవైపు సోమవారం తాను క్షేమంగానే ఉన్నట్లు రతన్ టాటా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. టాటా 1991లో స్టీల్ మరియు ఆటోస్‌కి ఛైర్మన్ అయ్యారు. వంద ఏళ్ల క్రితం స్థాపించిబడిన టాటా గ్రూప్‌ని 2012 వరకు నడిపారు. 1996లో టెలికమ్యూనికేషన్స్ కంపెనీ టాటా టెలిసర్వీసెస్‌ని స్థాపించారు. 2004లో ఐటీ కంపెనీ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)ని స్థాపించారు. పదవీవిరమణ తర్వాత, టాటా సన్స్, టాటా ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్,టాటా కెమికల్స్ రతన్ టాటాని చైర్మన్ ఎమెరిటస్ బిరుదుతో ప్రదానం చేసినట్లు కంపెనీ వెబ్‌సైట్ పేర్కొంది.