NTV Telugu Site icon

Kishan Reddy: కేంద్రమంత్రిపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు.. కారణమిదే!

Kishan Reddy

Kishan Reddy

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్‌ ధన్‌ఖడ్ ప్రశంసలు కురిపించారు. బొగ్గు, గనుల శాఖలో సమర్థతతో పాటు పారదర్శకత తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారని కితాబు ఇచ్చారు. సింగిల్ విండో వ్యవస్థ చాలా అద్భుతమైనదని, గనులు మన సహజ సంపద అని.. ఈ విషయంలో కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డికి అభినందనలు తెలపాలని రాజ్యసభ చైర్మన్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Aghori Arrested: వేములవాడ ఆలయంలోని దర్గాను కూల్చివేయడానికి వెళ్తున్న అఘోరి.. అడ్డుకున్న పోలీసులు

ఉపరాష్ట్రపతికి కేంద్రమంత్రి కృతజ్ఞతలు
‘గౌరవనీయులైన ఎంపీ.. రాజ్యసభలో ఇవాళ అడిగిన ప్రశ్నకు.. బొగ్గు, గనుల రంగంలో పారదర్శకత పెంపొందిచేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించాను. గనుల రంగంలో సింగిల్ విండో వ్యవస్థను కొనియాడిన గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ గారికి కృతజ్ఞతలు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గనుల రంగంలో సమర్థత, పారదర్శకత తెచ్చేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం’ అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఇాది కూడా చదవండి: Hindupur Municipality: హిందూపురం మున్సిపాలిటీలో అసలు ఏం జరిగింది..?