Site icon NTV Telugu

సీడీఎస్ బిపిన్ రావత్, భార్య క్షేమంగా వుండాలి.. రాహుల్ ట్వీట్

తమిళనాడు కూనురు దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కూలిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో సీడీఎస్‌ జనరల్ బిపిన్‌ రావత్‌తో పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు వున్నారు. ప్రమాదంలో 11 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన భార్య ఆచూకీ కూడా తెలియడం లేదని సమాచారం. బిపిన్ రావత్, ఆయన భార్య క్షేమంగా వుండాలని, వీరు త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Exit mobile version