కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే దేశంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న తాను..దేశం నలుమూలల నుంచి బాధకరమైన వార్తలు వింటున్నానని తెలిపారు రాహుల్ గాంధీ. పనికి రాని ఉత్సవాలు, ప్రసంగాలు కాకుండా.. సంక్షోభానికి పరిష్కరాం చూపించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా కేంద్రం తన తీరును మార్చుకోవాలని హెచ్చరించారు.
స్పీచులు వద్దు..పరిష్కారం చూపండి : ప్రధాని మోడీకి రాహుల్ చురకలు
