Site icon NTV Telugu

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించిన పంజాబ్‌.. ఎంతంటే..?

దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించాలని కేంద్రం కోరింది. దీంతో బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు మరి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై తమ వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించి అమలు చేశాయి.

ఈ నేపథ్యంలో తాజాగా పంజాబ్‌ ప్రభుత్వం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు పంజాబ్‌ సీఎం చరన్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఓ ప్రకటనలో తెలిపారు. లీటర్‌ పెట్రలో పై రూ. 10, లీటర్‌ డీజిల్‌పై రూ.5 తగ్గించినట్లు ఆయన వెల్లడించారు. తగ్గించిన ధరలు ఈ ఆర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version