Site icon NTV Telugu

Delhi Vehicle Policy : పాత వాహనాల నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం యూటర్న్..

Delhi Vehicle Policy

Delhi Vehicle Policy

Delhi Vehicle Policy:ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన వెహికిల్ పాలసీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం కావడంతో మళ్లీ యూటర్న్ తీసుకుంది. 15 ఏళ్ల కన్నా పాతవైన పెట్రోల్ వాహనాలకు, 10 ఏళ్ల కన్నా పాతవైన డీజిల్ వాహనాలకు ఇంధనం ఇవ్వద్దని ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేశారు. పాత వాహనాల నిషేధాన్ని నిలిపివేస్తూ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది.

Read Also: Pakistan: ‘‘ ప్రతిస్పందించడానికి మాకు 30 సెకన్ల టైమ్ మాత్రమే ఉంది’’.. బ్రహ్మోస్ దాడిపై పాకిస్తాన్..

దీనిపై ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. సాంకేతిక సవాళ్లు, సంక్లిష్ట వ్యవస్థల కారనంగా అమలు చేయడం కష్టం, జాగ్రత్తగా ఉండే వ్యక్తులను శిక్షించే బదులు, పేలవంగా నిర్వహించబడుతున్న వాహనాలను స్వాధీనం చేసుకునే వ్యవస్థ ఉంది’’ అని చెప్పారు.

కాలం ముగిసిన వాహనాలకు ఫ్యూయల్ నిరాకరించడాన్ని నిలిపివేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ను ఢిల్లీ ప్రభుత్వం కోరింది. ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ ఢిల్లీ అంతటా పనిచేయడం లేదని చెప్పింది. పాత వాహనాలను గుర్తించడానికి ఉపయోగిస్తున్న టెక్నాలజీలో లోపాలు ఉన్నాయని వెల్లడించింది. పక్క రాష్ట్రాల డేటా బేస్‌లో అనుసంధానం లేదని, ఢిల్లీలో యూపీ, హర్యానా, రాజస్థాన్ వాహనాలు ఎక్కువగా ప్రయాణిస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది.

Exit mobile version