NTV Telugu Site icon

NIA: పాక్ లింక్డ్ “గజ్వా-ఏ-హింద్” టార్గెట్‌గా 4 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు..

Nia

Nia

NIA: దాయాది దేశం పాకిస్తాన్, భారతదేశంలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా జాతీయ దర్యాప్తు సంస్థలు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం రోజున ఎన్ఐఏ బీహార్ రాష్ట్రంలో పాకిస్తాన్ నిర్వహిస్తున్న టెర్రర్ మాడ్యుల్ కేసులో ఏకకాలంలో నాలుగు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్, గుజరాత్ లోని గిర్ సోమనాథ్, ఉత్తర్ ప్రదేశ్ లోని ఆజంగఢ్, కేరళలోని కోజికోడ్‌లో ఎన్ఐఏ దాడులు చేసింది. పాకిస్తాన్ మద్దతు ఉన్న గజ్వా-ఏ-హింద్ టెర్రర్ మాడ్యుల్ కేసులో ఎన్ఐఏ దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి.

ఈ సోదాల్లో పాకిస్తాన్ హ్యాండర్లలో అనుమానితులకు లింకులు ఉన్నాయనే వివరాలు వెలుగులోకి వచ్చాయని ఎన్ఐఏ పేర్కొంది. అనుమానితులు తరుచుగా పాక్ హ్యండర్లతో సంప్రదింపులు జరుపుతున్నారని రాడికల్, భారత వ్యతిరేక ఆలోచనలను ప్రచారం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తేలింది. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన దాడుల్లో మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Spying: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న ఇద్దరి అరెస్ట్..

గజ్వా-ఏ-హింద్ టెర్రర్ మాడ్యుల్ కేసు బీహార్‌లో మొదలైంది. ఈ మాడ్యుల్‌కి పాక్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉందని, భారత్‌లో దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. జైన్‌గా గుర్తించబడిన పాకిస్తాన్‌కి చెందిన వ్యక్తి వాట్సాప్ ద్వారా గజ్వా-ఏ-హింద్ క్రియేట్ చేసి, దానికి మార్ఘూబ్ అహ్మద్ డానిష్‌ని అడ్మిన్‌గా ఉంచాడు. ప్రస్తుతం డానిష్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

జూలై 2022లో ఎన్ఐఏ, బీహార్ పోలీసుల నుంచి దర్యాప్తును చేపట్టింది. నిందితుడు మార్ఘూబ్ భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, యెమెన్ సహా ఇతర దేశాలకు చెందిన పలువురిని వాట్సాప్ గ్రూపులో చేర్చుకున్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. వాట్సాప్ కాకుండా టెలిగ్రామ్, ఇతర సోషల్ మీడియ ఫ్లాట్‌ఫారమ్స్‌లో ఇలాంటి గ్రూపులను క్రియేట్ చేశాడు. భారతదేశం అంతటా ఉగ్రవాద కార్యకలాపానలు పెంచేందుకు స్లీపర్స్ సెల్స్‌ని పెంచాలనే ఉద్దేశంతో గ్రూపులోని సభ్యుల్ని ప్రేరేపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.