NTV Telugu Site icon

Siddaramaiah: ప్రైవేట్ ఉద్యోగాల కోటాపై సిద్ధరామయ్య మరో ప్రకటన

Siddaramaiah

Siddaramaiah

ప్రైవేట్ ఉద్యోగాల కోటాపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపింది. ప్రైవేటు సంస్థల్లో స్థానికులకే 100 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేయగానే.. ఆయా కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆయన ఆ పోస్టు తొలగించారు. తాజాగా సిద్ధరామయ్య మరో ప్రకటన చేశారు. దీనిని తాత్కాలికంగానే నిలిపివేశామని.. వచ్చే కేబినెట్ సమావేశంలో మరోసారి చర్చిస్తామని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. అప్పుడు ఈ బిల్లుపై ఉండే సందేహాలను పూర్తిగా నివృత్తి చేస్తామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Santhi Kumari: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. అధికారులకు సీఎస్ కీలక సూచనలు

సిద్ధరామయ్య మాట్లాడుతూ.. సోమవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్రైవేటు కోటాపై పూర్తిస్థాయి చర్చ జరగలేదన్నారు. కానీ.. ఈలోపే దీనిపై మీడియాలో కథనాలు వచ్చేశాయని చెప్పారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొందన్నారు. తదుపరి కేబినెట్ సమావేశంలో చర్చించి.. సందేహాలను నివృత్తి చేస్తామని ప్రకటించారు. ప్రైవేటు బిల్లుపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్ష నేత ఆర్‌. అశోక్ డిమాండ్ చేసిన నేపథ్యంలో.. ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

ఇది కూడా చదవండి: Breaking: తన విడాకులను కన్ఫామ్ చేసిన హార్దిక్..

Show comments