Site icon NTV Telugu

Presidential Election 2022: నేడే రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు.. పీఠం ముర్ముదే!

President Election

President Election

Presidential Election 2022: భారత అత్యున్నత పీఠాన్ని అధిరోహించే నేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పార్లమెంట్ భవనంలో ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రం వరకు ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. అధికార ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా రాష్ట్రపతి పీఠం కోసం తలపడిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులను ఇప్పటికే పార్లమెంట్‌ హౌస్‌కు చేర్చారు.

BJP Celebrations: “రారండోయ్‌ వేడుక చేద్దాం” అంటున్న బీజేపీ. సెలబ్రేషన్స్‌కి రేపే శ్రీకారం..

ద్రౌపది ముర్ముకు తగినంత మెజారిటీ ఉండటంతో ఆమె విజయం లాంఛనమేనని రాజకీయ పండితులు తేల్చిచెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో కొందరు ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా క్రాస్‌ ఓటింగ్‌తో ఆమె వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. దీంతో ఆమె ఊహించినదాని కంటే అధిక మెజారిటీతో గెలుస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముర్ము విజేతగా నిలిస్తే.. రాష్ట్రపతి పీఠమెక్కిన తొలి గిరిజన మహిళగా రికార్డు సృష్టిస్తారు.ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ఈ నెల 24న ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు.

Exit mobile version