Draupadi Murmu:: పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి గిరిజన నాయకురాలిగా చరిత్ర సృష్టించిన ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా సోమవారం ప్రత్యేక వస్త్రధారణతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె రంగురంగుల దారాలతో నేసిన సంప్రదాయ సంతాలీ చీరను ధరించారు. తెల్లటి చీర ఎగువ అంచున ఎరుపు రంగు గీతతో, దిగువ వైపున త్రిభుజాకార స్పైక్‌లతో విశాలమైన ఆకుపచ్చ గీతను కలిగిన చీరను ధరించారు. ఆకుపచ్చ ఎరుపు రంగు కాంబినేషన్ల ఉన్న అంచులతో తెల్లటి రంగులో ఉన్న ఈ చీర చూడ్డానికి ఎంతో సింపుల్‌గా అందంగా ఉంది. చాలా అందంగా కనిపించే సంతాలీ చీర సాధారణంగా చేతితో తయారు చేయబడింది. ఇందులో ఎలాంటి యంత్రాలను ఉపయోగించకుండా తయారు చేశారు. నేత కార్మికులు చక్కటి రంగు దారాలతో ఈ చీరను తయారు చేస్తారు.
ఈ చీర పూర్తి సింపుల్‌గా సాంప్రదాయ శైలిలో ఉన్నా ట్రెండింగ్ లుక్‌ను ఇస్తుంది. ఒకప్పుడు గిరిజన మహిళలు ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఈ చీరలు ధరించేవారట. గతంలో స్త్రీల స్వాతంత్ర్యానికి, సాధికారతకు చిహ్నంగా ఈ చీరలపై ప్రత్యేకంగా మూడు విల్లులను డిజైన్లను కలిగిఉండేవి. అయితే కాలక్రమేణా ఆ డిజైన్ల స్థానంలో మార్పులు వచ్చాయి. నేటి నాగరికత, సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఈ చీరలను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు చీర అంచులపై చారలతో పాట పువ్వులు, నెమళ్లు, బాతులు ఉంటాయి. కాగా తూర్పు భారతదేశంలోని సంతాలీ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు. జార్ఖండ్‌తో పాటు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల్లో ఈ చీరకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఎలాంటి యంత్రాల సహాయం లేకుండా కేవలం చేతితో తయారు చేయడం వల్ల ఈ చీర ఖరీదు కూడా కాస్త ఎక్కువే.
President Draupadi Murmu: ముర్ముకు అభినందనల వెల్లువ.. చైనా, శ్రీలంక అధినేతల కీలక సందేశం
ముర్ము దేశాన్ని ఉద్దేశించి చేసిన మొదటి ప్రసంగంలో, స్వాతంత్య్రం తర్వాత జన్మించిన మొదటి అధ్యక్షురాలని తానేనని, దేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో బాధ్యతలు స్వీకరించడం తనకు గర్వకారణమని పేర్కొంది. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని నిర్వహించిన మొదటి గిరిజన, రెండవ మహిళగా చరిత్ర సృష్టించింది. రాష్ట్రపతి పదవికి చేరుకోవడం తన వ్యక్తిగత విజయం కాదు, భారతదేశంలోని ప్రతి పేదవాడి విజయమని ముర్ము తన ప్రసంగంలో పేర్కొన్నారు. 64 ఏళ్ల ద్రౌపది ముర్ముతో పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. జులై 24న ఐదేళ్ల పదవీకాలం ముగిసిన రామ్ నాథ్ కోవింద్ తర్వాత ఆమె బాధ్యతలు చేపట్టారు.