NTV Telugu Site icon

Droupadi Murmu: కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన రాష్ట్రపతి

Droupadimurmu

Droupadimurmu

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. త్రివేణి సంగమం దగ్గర పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం ప్రార్థనలు చేశారు. అంతకముందు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి యూపీకి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, గవర్నర్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనాంలో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని రాష్ట్రపతి పుణ్య స్నానం ఆచరించారు.

ఇది కూడా చదవండి: Chiranjeevi : ఇండస్ట్రీలో ఉన్నది ఒక్కటే కాంపౌండ్.. మెగాస్టార్ అన్ని అనుమానాలు లేపేశాడుగా!

మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా దేశాల దౌత్యవేత్తలు వచ్చి పుణ్యస్నానాలు చేసి వెళ్లారు. ఇక భక్తుల కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.