Uniform civil code: యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లును తీసుకువచ్చేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం వచ్చే వారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనుంది. యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ వార్తల్లో నిలిచింది. దీనిపై ఏర్పాటు చేసిన జస్టిస్(రిటైర్డ్) రంజనా దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి నివేదిక సమర్పించనుంది.
Read Also: Rohit Sharma: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. రోహిత్ శర్మ ముందు మూడు రికార్డులు!
దీపావళి తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు సమచారం. ఈ సమావేశాల్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది జూన్ నెలలో రంజనా ప్రకాష్ దేశాయ్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్ ముసాయిదా తయారైనట్లు, త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తున్నట్లు వెల్లడించారు.ఇదిలా ఉంటే గుజరాత్ కూడా 2024 లోక్ సభ ఎన్నికల ముందు యూసీసీని అమలు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంది. 2 లక్షల మంది ప్రజలతో మాట్లాడింది. యూసీసీ అనేది భారతదేశంలోని ప్రజలందరికీ ఒకే చట్టాన్ని వర్తించేలా చేస్తుంది. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత మొదలైన అంశాలు మతంపై ఆధారపడి ఉండవు. మరోవైపు ఉత్తరాఖండ్ బహూభార్యత్వాన్ని పూర్తిగా రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సహజీవనం చేసే జంటలు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధనలు ఉన్నట్లు తెలుస్తోంది.