NTV Telugu Site icon

PM Narendra Modi: భారీగా పెరిగిన ప్రధాని మోడీ ఆస్తులు.. ఎంతంటే?

Prime Minister Narendra Modi

Prime Minister Narendra Modi

PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తులు గతంతో పోలిస్తే భారీగానే పెరిగాయి. ప్రస్తుతం ఆయన వద్ద రూ.2.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందులో ఎక్కవ భాగం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. అయితే, ఎలాంటి స్థిరాస్తులు లేవు. గాంధీనగర్‌లో గతంలో కొనుగోలు చేసిన భూమిని మోడీ విరాళంగా ఇచ్చేశారు. ఈ మేరకు తాజాగా వెల్లడించిన ఆస్తుల వివరాల్లో మోడీ పేర్కొన్నారు. మార్చి 31 వరకు అప్‌డేట్ చేయబడిన ఆయన డిక్లరేషన్ ప్రకారం.. ప్రధాని మోడీ ఎటువంటి బాండ్లు, షేర్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి లేదు, ఏ వాహనం సొంతంగా లేదు, అయితే రూ. 1.73 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి.

ప్రధాని మోదీకి చెందిన చరాస్తులు ఏడాది క్రితం 2021, మార్చి 31 నాటికి రూ.26.13 లక్షలుగా ఉండేవి. రూ.1.1 కోట్లు విలువైన స్థిరాస్తి ఉంటే దానిని విరాళంగా ఇచ్చారు. అందులో కూడా ముగ్గురికి వాటా ఉన్నట్లు తెలిసింది. 2022, మార్చి 31 నాటి డిక్లరేషన్‌ ప్రకారం ప్రస్తుతం మోదీ వద్ద ఆస్తులు రూ.2,23,82,504 ఉన్నాయి. ఈ మేరకు వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. 2022, మార్చి 31 నాటికి మోదీ చేతిలో రూ.35,350 నగదు ఉంది. అలాగే పోస్ట్‌ఆఫీస్‌లోని నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫెక్ట్‌ విలువ రూ.9,05,105, జీవిత బీమా పాలసీల విలువ రూ.1,89,305గా ఉన్నాయి.

Chirag Paswan: నితీష్ కుమార్ విశ్వసనీయత సున్నా.. బిహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి..

‍ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేబినెట్‌ మంత్రులు తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వద్ద చరాస్తులు రూ.2.54 కోట్లు, రూ.2.97 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. 29 కేంద్ర మంత్రుల్లో గత ఆర్థిక సంవత్సరంలోని తమ, తమపై ఆధారపడిన వారి ఆస్తుల వివరాలను వెల్లడించిన వారిలో ధర్మేంద్ర ప్రదాన్‌, జోతిరాదిత్య సింధియా, ఆర్‌కే సింగ్‌, హర్దీప్‌ సింగ్‌ పూరీ, పర్శోత్తమ్‌ రూపాలా, జీ కిషన్‌ రెడ్డి, ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీలు ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కేబినెట్ మంత్రిగా పనిచేసి, జులైలో పదవి నుంచి వైదొలిగిన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా తన ఆస్తులను ప్రకటించారు.