Site icon NTV Telugu

PM Modi Manipur Tour: 2023 నుంచి మణిపూర్లో హింస.. తొలిసారి వెళ్తున్న ప్రధాని మోడీ

Modi

Modi

PM Modi Manipur Tour: మణిపూర్‌లో 2023లో ప్రారంభమైన మైతి – కుకీల మధ్య జాత్యహంకార ఘర్షణల్లో సుమారు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన తర్వాత, మొదటి తొలిసారి మణిపూర్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. రెండు సంవత్సరాలుగా మణిపూర్ ను ప్రధాని సందర్శించలేదని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించారు.

Read Also: ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫోటోతో 92 లక్షల మోసం, WhatsApp DP స్కామ్

అయితే, మణిపూర్ లోని చురాచాంద్‌పూర్‌లో రూ.7,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి పథకాలకు రేపు ( సెప్టెంబర్ 13న) ప్రధాని మోడీ భూమిపూజ చేయనున్నారు. చురాచాంద్‌పూర్‌ 2023 హింసలో అత్యంత ప్రభావితమైన ప్రాంతాల్లో ఒకటి. ఇక, ప్రధాని పర్యటనకు కేవలం రెండు రోజుల ముందు గురువారం నాడు అక్కడ ప్రధాన మంత్రి పర్యటన కోసం చేసిన ఏర్పాట్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది.

Read Also: ఆరోగ్యం లో ఒక అడుగు ముందుకు సాగాలంటే గ్రీన్ టీ సిప్ తాగాల్సిందే మరి…

కాగా, భూమిపూజ అనంతరం ప్రధాని మోడీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఇంఫాల్‌లో రూ.1,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అయితే, ప్రధాని రాక నేపథ్యంలో మణిపూర్ లో భారీగా బందోబస్త్ ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు కేంద్రబలగాలు పహారా కాస్తున్నాయి.

Exit mobile version