Site icon NTV Telugu

PM Modi : నేపాల్‌కు పయనమైన ప్రధాని..

Modi

Modi

నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ ఆహ్వానం మేరకు బుద్ధ పౌర్ణిమ సందర్భంగా భారత ప్రధానమంత్రి మోదీ నేపాల్‌కు పయనమయ్యారు. మోడీ ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లోని కుశినగర్ గౌతమ బుద్ధుడు మోక్షం పొందాడని ప్రసిద్ధికెక్కిన మాయాదేవి ఆలయాన్ని సందర్శింస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు మోడీ. ఇక్కడ ప్రార్థనలను నిర్వహించిన తర్వాత మోడీ నేపాల్ లోని గౌతమ బుద్ధుడి జన్మస్థలం లుంబినీకి వెళ్లనున్నారు.

లుంబినీ డెవలప్ మెంట్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. లుంబినీలో బౌద్ధ సంస్కృతి, వారసత్వం కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి మన దేశం ఆర్థిక సాయాన్ని అందిస్తున్న నేపథ్యంలో వారసత్వ కేంద్రం నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేస్తారు. మరోవైపు ఇరు దేశాలకు సంబంధించి ఐదు అవగాహన ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేయనున్నాయి. అంతేకాకుండా.. తన పర్యటన సందర్భంగా మోదీ స్పందిస్తూ… బుద్ధుడి బోధనలు ఈ ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచుతాయన్నారు. నేపాల్ ప్రధాని ఇటీవల ఇండియాకు వచ్చినప్పుడు ఇద్దరి మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని, ఈరోజు నేపాల్ ప్రధానితో సమావేశం కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని మోడీ వెల్లడించారు.

Exit mobile version