NTV Telugu Site icon

PM Narendra Modi: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

Pm Modi Meets President

Pm Modi Meets President

PM Narendra Modi: రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ట్వీట్ చేసింది. మాజీ రాష్ట్రపతి ప్రతిభా దేవిసింగ్ పాటిల్ కూడా తన కుమార్తెతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ముర్ముని కలిశారు. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరీలాల్ పురోహిత్ కూడా ఈరోజు రాష్ట్రపతిని కలిశారు.

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. ప్రధాని, ఉపరాష్ట్రపతితో పాటు విదేశీ ప్రముఖులు ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి పదవిని ద్రౌపదీ ముర్ము అలంకరించడం దేశచరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ముర్ము ప్రమాణస్వీకారం చేయడాన్ని దేశమంతా గర్వంతో తిలకించిందన్నారు. ఆమె పదవీ కాలం ఫలప్రదంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి పదవిని ద్రౌపదీ ముర్ము అలంకరించడం దేశచరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ద్రౌపది ముర్ము సోమవారం భారతదేశ మొదటి గిరిజన రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు.

Monkeypox: కలవరపెడుతున్న మంకీపాక్స్.. లక్షణాలు, చికిత్సలు, టీకాల గురించి తెలుసుకోండి..

రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకార ప్రసంగాన్ని ప్రధాని ప్రశంసించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. 64 ఏళ్ల ఆమె ప్రతిపక్ష అధ్యక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఓడించి రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి గిరిజన, రెండవ మహిళగా అవతరించారు. ప్రెసిడెంట్ ముర్ము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో.. దేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో బాధ్యతలు స్వీకరించడం తనకు గౌరవంగా ఉందని పేర్కొన్నారు. తాను ఈ పదవికి ఎదగడం తన సొంత ఘనతే కాదు, దేశంలోని ప్రతి పేదవాడి విజయమని, కోట్లాది మంది భారతీయుల విశ్వాసానికి అద్దం పడుతుందని ఆమె అన్నారు.