NTV Telugu Site icon

SCO Summit: ఎస్‌సీఓ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ.. 15 మంది దేశాధినేతలు హాజరు

Sco Meeting

Sco Meeting

PM Modi among 15 leaders to attend SCO summit: సెప్టెంబర్ 15,16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ హాజరుకానున్నారు. మోదీతో పాటు 15 మంది ప్రపంచ దేశాల నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కోవిడ్ మహమ్మారి తరువాత ఇది మొదటి సమావేశం. చివరి ఎస్‌సీఓ సమావేశం 2019 జూన్ నెలలో కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్‌కెక్‌లో జరిగింది.

అధికారిక సమాచారం ప్రకారం ఈ నెల 14 మోదీ ఉజ్బెకిస్తాన్ వెళ్లి 16 తేదీన తిరిగి ఇండియాకు రానున్నారు. వచ్చే ఏడాది షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనుంది. దీంతో ఈ సమావేశం భారతదేశానికి కీలకం కానుంది. 2023 ఏడాదికి గానూ ఎస్‌సీఓకు భారత్ నాయకత్వం వహించనుంది. వచ్చే ఏడాది ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రధాని నరేంద్రమోదీ, పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.

Read Also: Revanth Reddy Letter to CM KCR: వారి సమస్యలు పరిష్కరించండి.. సీఎం కు రేవంత్ రెడ్డి లేఖ

భారత్, చైనా, రష్యాతో పాటు పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, తజకిస్తాన్, కజకిస్తాన్ పూర్తిస్థాయి సభ్యదేశాలుగా ఉన్నాయి. ఆప్ఘనిస్తాన్ ఈ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతోంది. బెలారస్, ఇరాన్, మంగోలియా దేశాలు కూడా ఎస్‌సీఓ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ దేశాలు పరీశీలకులుగా ఉన్నాయి. అర్మేనియా, అజర్‌బైజాన్, కంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీ దేశాలు ఈ కూటమిలో చేరేందుకు చర్చలు జరుగుతున్నాయి.

ఈ సమావేశాల్లో భారత్, పాకిస్తాన్ దేశాధినేతల మధ్య సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, భారత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్దం తరువాత ప్రపంచంలోని ప్రధాన శక్తులైన రష్యా, చైనా, భారత్ వంటి దేశాలు ఒకే వేదికపై కలుసుకుంటున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానం దేశాల మధ్య వాణిజ్యం, ఉగ్రవాద నిర్మూలన, పర్యావరణ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

Show comments