Site icon NTV Telugu

Viral News: “గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుగుతూ దొరికిన కొడుకు”.. పబ్లిక్‌లోనే వాయించిన పేరెంట్స్..

Kanpur

Kanpur

Viral Video: ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుగుతూ తల్లిదండ్రులకు చిక్కాడు. ఇంకేముంది అందరూ చూస్తుండగానే, కుమారుడిని కొట్టారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో శుక్రవారం జరిగింది. 21 ఏళ్ల యువకుడు రోహిత్ తన 19 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌తో నగరంలోని రాంగోపాల్ జంక్షన్ వద్ద పట్టుబడ్డాడు. గుజైని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Read Also: Off The Record: వైసీపీ వాళ్ళయినా ఒకే.. ఇవ్వాల్సింది ఇస్తే చాలు అంటున్న కూటమి ఎమ్మెల్యే కొండబాబు?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రోహిత్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి తిరుగుతుండగా అతడి పేరెంట్స్ శివకరణ్, సుశీల సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరిద్దరి రిలేషన్‌‌ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు రోహిత్‌ని అతడి స్నేహితురాలిని కొట్టడం ప్రారంభించారు.

ఈ కేసు తర్వాత పోలీస్ స్టేషన్‌కి చేరింది. పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇరు వర్గాలను విడదీశారు. అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు ప్రకటించారు. వీడియోలో, బైక్‌పై యువ జంట పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సుశీల వారిపై దాడి చేయడం చూడవచ్చు. స్థానికంగా ఉన్న ప్రజలు దాడిని ఆపేందుకు ప్రయత్నించారు. యువతి జుట్టు పట్టుకోవడం కనిపిస్తుంది. రోహిత్ తండ్రి అతడిని చెప్పుతో కొట్టడం కనిపిస్తుంది.

Exit mobile version