Site icon NTV Telugu

Karnataka: రోజూ ఫుడ్ కు బదులు ఇంజిన్ ఆయిల్ తాగుతున్న వ్యక్తి.. వీడియో వైరల్

Sam (10)

Sam (10)

కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ అనే వ్యక్తి ఎటువంటి ఆహరం తీసుకోకుండా కేవలం ఇంజన్ ఆయిల్ మాత్రమే తాగుతూ జీవిస్తున్నాడు.. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం..

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి తాను ఆహారం లేకుండా జీవిస్తున్నానని, అన్నం, చపాతీకి బదులుగా 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ మరియు టీ మాత్రమే తాగుతున్నానని ఆయన చెబుతున్నాడు. దీంతో ఆయన ప్రపంచ ఆరోగ్య నిపుణులకు ఒక రహస్యమైన కేస్ స్టడీగా మారాడు. వైద్యులు, శాస్త్రవేత్తలు అతని మాటలు, జీవనశైలిని చూసి షాక్ అయ్యారు. 33 ఏళ్ల ఆ వ్యక్తి ఇప్పటికీ ఫిట్‌గా ఉండటానికి గల కారణాన్ని స్పష్టం చేయలేకపోతున్నారు. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఆయిల్ కుమార్‌గా స్థానికంగా ఫేమస్‌ అయిపోయారు. అయ్యప్ప ఆశీస్సుల వల్లే ఈ ప్రత్యేకమైన జీవనశైలి సాధ్యమవుతుందని అన్నారు.

అతని ప్రమాదకరమైన ఆహారం పద్దతిని చూసి ఆశ్చర్యపోయిన సోషల్‌ మీడియా వినియోగదారుడు ఈ వీడియోను పోస్టు చేశాడు. మానవులు నిజంగా ఇంజిన్ ఆయిల్ తాగగలరా లేదా అని నిర్ధారించడానికి AIని సంప్రదించారు, దీనికి AI దిగ్భ్రాంతికరమైన ఫలితాలతో స్పందించింది. ఇంజిన్ ఆయిల్ తాగడం మానవ శరీరానికి నిజంగా హానికరం, ఇది తీవ్రమైన విషాదానికి దారితీస్తుందని AI తెలిపింది. ఇది విషపూరితమైనది. కోమాలోకి వెళతారు. మరణిస్తారు కూడా అని AI స్పందించింది.

Exit mobile version