NTV Telugu Site icon

Noida Crime: యజమాని అరాచకం.. పనిమనిషిని లిఫ్ట్‌లో నుంచి లాక్కెళ్లి..

Domestic Help Assaulted

Domestic Help Assaulted

Noida Woman Booked After Assaulting Her In Domestic Help In Lift: ఒక యజమాని తన పనిమనిషి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించింది. తాను పని చేయలేను మొర్రో అని పనిమనిషి వేడుకుంటున్నా.. ‘నువ్వు చేయాల్సిందే’నంటూ బలవంతం చేసింది. లిఫ్ట్‌లో నుంచి లాక్కెళ్లి మరీ తన ఇంట్లో బంధించింది. అంతకుముందు రకరకాలుగా చిత్రహింసలకు గురి చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Zomoto Biryani : ఏంటి సామి ఇది.. ఎంత ఇష్టమైతే ఏడాదిలో ఇన్ని బిర్యానీలా..

బౌద్ధ నగర్‌కు చెందిన షెఫాలీ కౌల్ అనే మహిళ (యజమాని) ఇంట్లోకి కొన్ని రోజుల క్రితం అనిత అనే యువతి పనిమనిషిగా చేరింది. మొదట్లో ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు.. షెఫాలీ చాలా పద్ధతి గల మహిళగా డ్రామాలు ఆడింది. తమ ఇంట్లో ఎక్కువ పని ఉండదని, సౌకర్యవంతంగా ఉండొచ్చంటూ మాయమాటలు చెప్పింది. పాపం అనిత.. పొట్ట కూటి కోసం ఆమె చెప్పిన మాటల్ని నమ్మింది. సుఖంగా పని చేసుకోవడంతో పాటు కొంత మొత్తం వెనకేసుకోవచ్చన్న ఆశతో.. షెఫాలీ ఇంట్లో పనిమనిషిగా చేరింది. అనిత ఇలా పనిమనిషిగా చేరడమే ఆలస్యం.. షెఫాలీ తన నిజస్వరూపం చూపించడం ప్రారంభించింది. పరిమితికి మించి ఎక్కువ పని ఇవ్వడం మొదలుపెట్టింది. ఎక్కువ పని చేయించడమే కాదు, అనితని చిత్రహింసలకు గురి చేసింది. చేయని తప్పులకు సైతం తప్పు చేశావంటూ నిందిస్తూ.. గదిలో బంధించి మరీ దాడి చేసింది.

Pawan Kalyan: సీఎం జగన్‌కు పవన్ బహిరంగ లేఖ.. ఆ పింఛన్లు ఎందుకు తొలగించారు?

షెఫాలీ వేధింపులు భరించలేకపోయిన అనిత.. ఆ నరకం నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంది. ఒక రోజు ఇంట్లో నుంచి పారిపోయింది. ఇది గమనించిన షెఫాలీ.. అనిత వెంట వెళ్లింది. లిఫ్ట్ నుంచి తన ఇంటికి లాక్కెళ్లింది. తాను రానని మొరపెట్టుకుంటున్నా.. రావాల్సిందేనంటూ జుట్టు పట్టుకొని బలవంతంగా తీసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగి, షెఫాలీపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా షెఫాలీకి సంబంధించి మరిన్ని షాకింగ్ పరిణామాలు వెలుగుచూశాయి. గతంలో ఆమె పలువురిపై ఇలాగే దాడులు చేసినట్లు తేలింది. ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా, యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.