Site icon NTV Telugu

High Courts: హైకోర్టుల పేర్ల మార్పు ప్రతిపాదన లేదు: కేంద్రం

High Courts

High Courts

High Courts: హైకోర్టుల పేర్ల మార్పు ప్రతిపాదన ఇప్పట్లో లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో హైకోర్టుల పేర్లను మార్చేందుకు గతంలో ప్రయత్నం జరిగినప్పటికీ.. ప్రస్తుతం అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో హైకోర్టుల పేర్లను మార్చే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బాంబే, కలకత్తా, మద్రాస్‌ హైకోర్టుల పేర్లకు సంబంధించి 2016లో హైకోర్టుల (పేరు మార్పు) బిల్లును తీసుకువచ్చింది. అనంతరం ఈ జాబితాలో మరిన్ని పేర్లను చేర్చింది. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ బిల్లు ప్రతిపాదనను విరమించుకున్నట్లు న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌మేఘ్వాల్‌ రాజ్యసభలో గురువారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

Read also: Krishna Gadu Ante Oka Range Review: కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ రివ్యూ

కొన్ని హైకోర్టుల పేర్లు మార్పు ప్రతిపాదనల గురించి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌మేఘ్వాల్‌ వివరించారు. ‘మద్రాస్‌ (పేరు మార్పు) చట్టం-1996 ప్రకారం.. మద్రాసు పేరును చెన్నైగా మార్చడం జరిగింది. అనంతరం మద్రాసు హైకోర్టు పేరును చెన్నై హైకోర్టుగా మార్చాలనే ప్రతిపాదనను 1997లో పంపించింది. ముంబయి, కోల్‌కతాలలోఉన్న హైకోర్టుల పేర్లనూ మార్చాలనే ఉద్దేశంతో వాటిని పరిగణనలోనికి తీసుకున్నాం. ఈ క్రమంలోనే 2016 జులైలో బిల్లును ప్రవేశపెట్టాం. ఆ తర్వాత ఒరిస్సా-ఒడిశాగా, గౌహతి-గువాహటిగా మారినందున ఆ జాబితాలో వీటిని కూడా చేర్చాం. కానీ, సంప్రదింపుల సమయంలో పేరును మార్చే ప్రతిపాదనలకు మిగతా రాష్ట్రాల నుంచి అంగీకారం వచ్చినప్పటి నుంచి తమిళనాడుతోపాటు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రస్తుతం అటువంటి ప్రతిపాదన తెచ్చే ఆలోచన లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Exit mobile version