Site icon NTV Telugu

Nagaland Assembly: ప్రతిపక్షమే లేని రాష్ట్రం.. అసెంబ్లీలో ప్రజాగొంతుక ఎలా?

Nagaland No Opposition

Nagaland No Opposition

Nagaland Assembly: నాగాలాండ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీపీపీ, బీజేపీ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు నాగాలాండ్‌లో అన్ని పార్టీలు అధికార పీఠం లో వాటా కోసం పోటీ పడుతున్నాయి. నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి) నేత నెఫియు రియో మంగళవారం కొహిమాలో ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు సీఎం నెఫియ రియోకి తమ మద్దతును ప్రకటించాయి. దీంతో రెండవసారి నాగాలాండ్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. అయితే NDPP నిర్ణయం తీసుకునే వరకు వారిని ప్రభుత్వంలో చేర్చుకుంటారా లేదా బయటి మద్దతుగా పరిగణిస్తారా అనేది స్పష్టంగా తెలియలేదు.

Kim Jong Warning: యుద్ధానికి సిద్ధంకండి.. సైనిక డ్రిల్‌లో కిమ్ హాట్ కామెంట్స్

నాగాలాండ్ లో 2021లో కూడా ప్రతిపక్షం లేదు. NDPP-BJP యొక్క పీపుల్స్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని.. యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ (UDA)గా పేరు మార్చిన తర్వాత ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీ 26 మంది ఎమ్మెల్యేలతో ఎన్‌పిఎఫ్ – స్వతంత్రుడితో కలిసి ప్రభుత్వంలో చేరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. మొత్తం 60 మంది సభ్యుల అసెంబ్లీలో NDPP-BJP 37 స్థానాలను గెలుచుకుంది. పలు పార్టీల ఎమ్మెల్యేలు తమ మద్దతు లేఖలను ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండపోయిందని బీజేపీకి చెందిన నాగాలాండ్ డిప్యూటీ సీఎం వై పాటన్ అన్నారు. రియో ప్రభుత్వానికి ఏడుగురు ఎమ్మెల్యేలతో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిన శరద్ పవార్ ఎన్సీపీ కూడా మద్దతు ఇచ్చింది. ముగ్గురు ఎమ్మెల్యేలతో ఎన్‌పిపి, అలాగే ఎన్‌డిఎతో కలిసి ఉన్న లోక్ జనశక్తి పార్టీ-రామ్ విలాస్, రాందాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఒక్క జేడీయూ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వానికి మద్దతు పలికారు.

Xi Jinping: ముచ్చటగా మూడోసారి.. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ ప్రమాణస్వీకారం

NDPP-BJP 40-20 సీట్ల అవగాహనలో ఆ కూటమి 37 గెలుచుకుంది. రియోకు మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీ ప్రకటికడం గమనార్హం. నాగాలాండ్‌లో రాజకీయాలు ఎవరూ ప్రతిపక్షంలో ఉండటానికి ఇష్టపడలేదు. ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు NDPP-BJP ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. అయితే, అసెంబ్లీలో ప్రతిపక్షం పూర్తిగా లేకపోవడం, శాసనసభ జవాబుదారీతనం లేకపోవడంతో రాష్ట్రాన్ని కొత్త అధోగతిలోకి నెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Exit mobile version