Site icon NTV Telugu

కొత్త చట్టం..! ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులే..

Population Bill

Population Bill

జనాభాలో భారత్‌ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.. క్రమంగా జనాభా పెరిగిపోతూనే ఉంది… కొన్ని రాష్ట్రాల్లో జనాభా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.. ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రజాప్రతినిధులుగా పోటీ చేయాలంటే.. సంతానాన్ని కూడా అర్హతగా పెట్టారు.. తాజాగా, జ‌నాభా నియంత్ర‌ణ కోసం ఉత్తర‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. త్వరలోనే కొత్త చట్టాన్ని తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఇప్పటికే ముసాయిదాను త‌యారు చేశారు.. దాని ప్రకారం.. ఇద్దరి క‌న్నా ఎక్కువ మంది పిల్లలు సంతానంగా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు కానున్నారు.. అలాంటి త‌ల్లితండ్రుల‌కు ప్రభుత్వ స‌బ్సిడీలు వర్తించకుండా, ప్రభుత్వం చేప‌ట్టే సంక్షేమ పథకాలు కూడా అందకుండా చట్టాన్ని రూపొందిస్తున్నారు.. ఇక, ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే.. వారు ప్రభుత్వ ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉండదన్నామట.. స్థానిక ఎన్నిక‌ల్లో పోటీప‌డే చేసే అభ్యర్థులకు కూడా ఈ కొత్త చట్టాన్ని వర్తింపజేయనున్నారు.. అయితే, యోగి సర్కార్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న ఈ కొత్త చట్టంపై అనేక విమర్శలు ఉన్నాయి.. ఇది కేవలం ముస్లింలను టార్గెట్‌ చేసేందుకేననే ఆరోపణలు ఉన్నాయి.. ఇక, సంతానం ఒకరే ఉంటే.. వారికి ఐఐటీ, ఎయిమ్స్‌లో సులువుగా ఎంట్రీ అయ్యే అవకాశం కూడా కల్పించనున్నట్టు చెబుతోంది యూపీ సర్కార్.

Exit mobile version