Site icon NTV Telugu

NEET: నీట్‌ విద్యార్థులకు శుభవార్త.. ఆ పరిమితి ఎత్తివేత

మెడికల్ విద్య చదవాలనుకుంటున్న వారికి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. అండర్ గ్రాడ్యుయేషన్ నీట్కు గరిష్ట వయోపరిమితిని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ రాసేందుకు జనరల్ కేటగిరి అభ్యర్థులకు 25 ఏళ్లు, రిజర్వేషన్ కేటగిరి వారికి 30 ఏళ్ల వయోపరిమితి నిబంధన ఉండగా.. తాజా నిర్ణయంతో గరిష్ట వయోపరిమితి నిబంధన తొలగిపోయినట్టు అయ్యింది.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG) 2022లో హాజరు అయ్యే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని తొలగించినట్లు జాతీయ వైద్య కమిషన్ (NMC) బుధవారం ప్రకటించింది.

Read Also: Karvy Scam: కార్వీకి ఈడీ బిగ్ షాక్.. రూ.1,984 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్

అక్టోబర్ 21, 2021 న జరిగిన 4వ ఎన్‌ఎంసీ సమావేశంలో.. నీట్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి నిర్ణీత గరిష్ట వయోపరిమితి ఉండకూడదని నిర్ణయించినట్టు తెలిపింది.. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.. ఈ నిర్ణయం ఔత్సాహిక వైద్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.. దేశంలో వైద్య విద్యను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని ట్వీట్‌ చేశారు.

Exit mobile version