Site icon NTV Telugu

India-Pakistan: నేడు పహల్గామ్ దాడిపై కేంద్రానికి ఎన్ఐఏ రిపోర్ట్..

Nia

Nia

India-Pakistan: జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ ( జాతీయ దర్యాప్తు సంస్థ ) తన ప్రాథమిక నివేదికను ఈ రోజు ( మే 4న) కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. డైరెక్టర్‌ జనరల్‌ సదానంద్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో నివేదిక రూపొందించారు. దాదాపు 150 మంది చెప్పిన సాక్ష్యాలు, దాడి జరిగిన తీరుపై త్రీడీలో పునః సృష్టి చేసిన దృశ్యాలు, సంఘటన ప్రదేశంలో దొరికిన ఆయుధాల సంబంధిత ఆధారాలు సహా పలు వివరాలతో కూడిన రిపోర్టును సిద్ధం చేశారు. ఇక, ఇప్పటికే 90 ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదు చేయగా.. సుమారు 3వేల మందిని ప్రశ్నించిన ఎన్ఐఏ.. 100కు పైగా ప్రాంతాల్లో బలగాల సోదాలు చేసింది. దీంతో పాటు పహల్గాంలోని బైసరన్‌కు వెళ్లి దర్యాప్తు పురోగతి గురించి స్వయంగా పర్యవేక్షించారు ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌ సదానంద్.

Read Also: NEET Exam: నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో ఎగ్జామ్ సెంటర్ల వద్ద భారీ బందోబస్తు..

అయితే, ఫోరెన్సిక్‌ నిపుణుల సహాయంతో మరిన్ని సాక్ష్యాల కోసం, మరింత మంది సాక్షుల నుంచి వివరాలను సేకరించేందుకు ఎన్‌ఏఐ ట్రై చేస్తుంది. ఇప్పటికే పాత ఉగ్రవాదులను కూడా ఎన్ఐఏ ప్రశ్నించింది. పహల్గాం ఉగ్రవాదులకు వీరితో ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు దర్యాప్తు టీమ్ గుర్తించింది. వీరిలో చాలా మందిని ఇప్పటికే అరెస్టు అయ్యారు.

Exit mobile version