Site icon NTV Telugu

New Army Chief: ఇంజనీర్ నుంచి ఆర్మీ బాస్ వరకూ

Manoj

Manoj

భారత ఆర్మీకి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్‌ ఎంఎం నవరణె స్థానంలో మనోజ్ పాండే పాండే బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంజనీర్ నుంచి ఆర్మీ చీఫ్‌ వరకూ ఆయన ప్రస్థానం ప్రతి సైనికుడికి స్ఫూర్తిదాయకం. ప్రధాని మోడీ నాయకత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ పాండే నియామకానికి పచ్చజెండా ఊపింది.

బిపిన్‌ రావత్‌ మరణంతో ఖాళీ అయిన సీడీఎస్‌ పోస్ట్‌ను ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ నవరణెతో భర్తీ చేస్తారనే ప్రచారం విరివిగా నడుస్తోంది. అయితే నవరణె ఏప్రిల్‌ చివరినాటికి రిటైర్‌ అవుతారు. ఈ నేపథ్యంలో ఆర్మీ కొత్త చీఫ్‌గా.. ప్రస్తుతం వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న మనోజ్‌ పాండేని నియమించారు. ఆర్మీ చీఫ్‌గా నియమితులు కాబోతున్న మొదటి ఇంజనీర్‌ మనోజ్‌ పాండే. అంతకు ముందు మనోజ్‌ పాండే.. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు దేశాల కమాండింగ్‌ సెక్షన్‌లో విధులు నిర్వహించారు. సుమారు 39 ఏళ్ల ఆర్మీ అనుభవం ఉన్న మనోజ్‌ పాండే.. ఏప్రిల్‌ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు. మనోజ్ పాండే పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవాపతకం పొందారు.
Read Also: Peddireddi Ramachandrareddy: విద్యుత్ ఇబ్బందులు లేకుండా చర్యలు

Exit mobile version