Site icon NTV Telugu

నేతాజీ హోలోగ్రామ్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌.. ఆయ‌న నినాదం మ‌న‌కు ప్రేరణ..

భార‌త స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి వేడుక‌ల్లో పాల్గొన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ త‌ర్వాత సుభాష్ చంద్ర బోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాలను ప్ర‌దానం చేశారు.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సుభాష్ చంద్ర‌బోస్ నినాదాన్ని గుర్తుచేసుకున్నారు.. ఏదైనా సాధించగలం అనే నేతాజీ నినాదాన్ని అంద‌రూ ప్రేరణగా తీసుకోవాల‌ని.. ఆయ‌న ప్రేరణతో దేశసేవకు అంకితం కావాలని సూచించారు.

Read Also: ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చొద్దు.. కేంద్రంపై పెరుగుతున్న ఒత్తిడి

ఇక‌, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఆర్మీని స్థాపించి దేశం కోసం సాహసం, పరాక్రమం చూపారని గుర్తుచేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. నేతాజీ దేశానికి గొప్ప వారసత్వాన్ని అందించారని కొనియాడిన ప్ర‌ధాని.. నేతాజీతో ముడిపడి ఉన్న అన్ని ప్రదేశాలను స్మారక ప్రదేశాలుగా మారుస్తామ‌ని ప్ర‌క‌టించారు. నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన రోజు చరిత్రాత్మకమైనదని పేర్కొన్న ప్ర‌ధాని.. ఆయన బ్రిటిషర్ల ముందు తల వంచడానికి నిరాకరించారని తెలిపారు. ఇది చరిత్రాత్మక ప్రదేశం, చరిత్రాత్మక సందర్భం అని… చేయగలం, చేస్తాం అనే నేతాజీ నినాదం నుంచి స్ఫూర్తిని పొందుతూ మనం ముందుకెళ్లాల‌ని సూచించారు.

Exit mobile version