NTV Telugu Site icon

ఈ నెల 31 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు

lockdown

క‌రోనా సెకండ్ వేవ్ పంజా విసురుతుండ‌డంతో.. మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి అన్ని రాష్ట్రాలు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి.. అందులో కేసులు భారీగా వెలుగు చూస్తున్న రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు పూనుకున్నాయి.. క‌రోనా కంట్రోల్ కాక‌పోవ‌డంతో.. మ‌ళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వ‌స్తున్నాయి.. ఇక‌, లాక్‌డౌన్ ను మే 31వ తేదీ వ‌ర‌కు తాజాగా నిర్ణ‌యం తీసుకుంది నాగాలాండ్ ప్ర‌భుత్వం.. క‌రోనా పాజిటివ్‌ కేసుల్లో త‌గ్గుద‌ల ఏమాత్రం లేక‌పోవ‌డంతో లాక్‌డౌన్ పొడిగింపున‌కే రాష్ట్ర ప్ర‌భుత్వం మొగ్గుచూపిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు.. అయితే, లాక్‌డౌన్ నుంచి నిత్యావ‌స‌రాల‌ను విక్ర‌యించే దుకాణాలు, వ్య‌వ‌సాయ కార్య‌క‌లాపాలను మిన‌హాయింపు ఇచ్చింది రాష్ట్ర ప్ర‌భుత్వం. ఇక‌, నిర్మాణ రంగ కార్య‌క‌లాపాల‌ను య‌థావిథిగా నిర్వ‌హించే వెసులుబాటును కూడా క‌ల్పించింది. కాగా, కోవిడ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డంతో.. ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.