Site icon NTV Telugu

ఎస్పీకి బీజేపీ మ‌రో షాక్‌: నిన్న కోడ‌లు… ఈరోజు…

యూపీలో వ‌చ్చే నెల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  మొత్తం ఏడు విడ‌త‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు అన్నిపార్టీలు ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఎన్నిలకుముందు వ‌ల‌స‌లు స‌హ‌జం.  ఇప్ప‌టికే బీజేపీ నుంచి అనేక‌మంది ఎమ్మెల్యేలు, మంత్రులు బ‌య‌ట‌కు వ‌చ్చి ఎస్పీలో చేరిపోయారు.  బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎస్పీలో చేరుతుంటే,  ఎస్పీ నుంచి నిన్న ములాయం సింగ్ యాద‌వ్ చిన్న కోడ‌లు అప‌ర్ణా యాద‌వ్ బీజేపీలో చేరారు.  కాగా, ఈరోజు ములాయం సింగ్ యాద‌వ్ తోడ‌ల్లుడు ప్ర‌మోద్ గుప్తా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎస్పీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.   మాఫియా నాయ‌కుల‌ను ఎస్పీలో చేర్చుకుంటున్నార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు.  ఆ పార్టీలో ములాయం సింగ్ యాద‌వ్ ఖైదీగా మారిపోయార‌ని, శివ‌లాల్ యాద‌వ్ ప‌ట్ల కూడా అఖిలేష్ యాద‌వ్ దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, అందుకే ఆ పార్టీలో ఉండ‌లేక‌పోతున్నాన‌ని ప్ర‌మోద్ గుప్తా పేర్కొన్నారు.  

Read: చైనా ఆ కిడ్నాప్ వెనుక కార‌ణాలు ఏంటి?

Exit mobile version