Site icon NTV Telugu

Sanjay Rout: పరువు నష్టం కేసులో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు జైలు శిక్ష..

Sanjay Rout

Sanjay Rout

Sanjay Rout: పరువు నష్టం కేసులో శివసేన (యూబీటీ) కీలక నేత సంజయ్‌ రౌత్‌కు భారీ షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీ నేత కిరీట్‌ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయనకు 15 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ ముంబయి న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్‌ 500 కింద సంజయ్ ను దోషిగా నిర్ధరించింది. ఆయనకు 25 వేల రూపాయల జరిమానాతో పాటు 15 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

Read Also: Sanjauli Mosque: సంజౌలీ మసీదులోకి ఏఐఎంఐఎం అధినేత ప్రవేశం.. కొనసాగుతున్న ఉద్రిక్తత..!

కాగా, మహారాష్ట్ర బీజేపీ నేత కిరీట్‌ సోమయ్య కుటుంబ సభ్యులు ఓ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు. మీరా భయందర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 100 కోట్ల రూపాయల టాయిలెట్‌ స్కామ్‌ జరిగిందని శివసేన యూబీటీ నేత సంజయ్‌ రౌత్ ఆరోపణలు గుప్పించారు. ఇక, ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పలు మీడియాల్లో కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే, వీటిని ఖండించిన కిరీట్‌ సోమయ్య సతీమణి మేధ ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

Exit mobile version