Site icon NTV Telugu

Moonlighting: ఇన్ఫోసిస్, విప్రో బాటలో ఐబీఎం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు స్ట్రాంగ్ వార్నింగ్

Moonlighting

Moonlighting

IBM warns those working two jobs: వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని ఉపయోగించుకుని కొంత మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఒకటికి మించి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా మూన్ లైటింగ్ పద్ధతిలో ఒకటికి మించి ఉద్యోగాలు చేయడంపై సాఫ్ట్‌వేర్ కంపెనీలు చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఎవరైనా తమ సంస్థకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇలా చేస్తే ఉద్యోగాల నుంచి తొలిగిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాయి. మూన్ లైట్ పద్ధతి అనైతిక పద్ధతి అని అగ్రశ్రేణి సాఫ్ట్‌వేర్ కంపెనీలు పేర్కొంటున్నాయి.

ఇప్పటికే భారత టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు తమ ఉద్యోగులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి. తమ సంస్థలో ఉద్యోగం చేస్తూ.. మిగిలి సమయాల్లో ఇతర కంపెనీలకు వర్క్ చేయడంపై చర్యలకు ఉపక్రమించాయి. మూన్ లైట్ పద్దతిలో ఉద్యోగాలు చేస్తే ఉద్యోగం నుంచి తీసి పారేస్తామని హెచ్చరించాయి. ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల బాటలో ఐబీఎం కూడా చేరింది. తమ ఉద్యోగులు మూన్ లైట్ పద్ధతిలో పనిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భారత దేశంలో ఐబీఎం టెక్ కంపెనీకి లక్ష మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. రెగ్యులర్ అవర్స్ తర్వాత సెకండీర ఉద్యోగాలు చేయడంపై అన్ని టెక్ దిగ్గజాలు ఫైర్ అవుతున్నాయి.

Read Also: Dulquer Salman: నేను ఇండస్ట్రీలో ఉండకూడదని వారు కోరుకున్నారు

ఐబీఎం ఇండియా, దక్షిణాసియా ఎండీ సందీప్ పటేల్ మాట్లాడుతూ.. కంపెనీలో చేరే సమయంలో ఐబీఎం కోసమే పని చేస్తామని ఒప్పందంపై సంతకం చేయడాన్ని గుర్తు చేశారు. మూన్ లైటింగ్ పద్ధతి నైతికంగా సరైనది కానది ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం ఇలా పనిచేయడాన్ని అన్ని టెక్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ ఉద్యోగుల ఈ ప్రవర్తనను ‘ మోసం ’గా అభివర్ణించారు. టైర్ -2, టైర్ -3 సిటీల్లో కూడా విస్తరించాలని ఐబీఎం భావిస్తున్నట్లు సందీప్ పటేల్ అన్నారు.

Exit mobile version