భారత్‌లో ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు వస్తే గెలుపెవరిది? మళ్లీ ప్రజలు ఎవరి పట్టం కడతారు? ఎన్డీఏకు వచ్చే సీట్లు ఎన్ని? యూపీఏ గెలుచుకోబోతోన్న స్థానాలు ఇంకెన్ని? లాంటి ఆస్తికరమైన అంశాలపై సర్వే ఫలితాలను విడుదల చేసింది ఇండియా టుడే.. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట జరిగిన ఈ సర్వే రిపోర్టుల్లో ఆసక్తికర అంశాలు బయటపెట్టింది.. మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఆ సర్వే తేల్చేసింది.. 543 స్థానాలున్న లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీఏ 296 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. యూపీఏ 127 స్థానాలో సరిపెట్టుకుంటుందని.. ఇతరుల 120 స్థానాలు దక్కించుకుంటారని వెల్లడించింది. ఇక, పార్టీల వారీగా చూస్తే.. అత్యధికంగా బీజేపీయే 271 స్థానాలను కైవసం చేసుకుంటుందని.. కాంగ్రెస్ పార్టీ 62 సీట్లకే పరిమితం అవుతుందని.. ఇతరులకు 210 స్థానాల్లో విజయం సాధిస్తారని పేర్కొంది.
వచ్చే నెలలో ఐదు రాష్ట్రాలు.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ మరియు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ సర్వే ఫలితాలు ఆసక్తికరంగా మారాయి.. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’లో కీలకమైన రాజకీయ పార్టీలు, నేతలు, దేశానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమస్యల గురించి భారతీయులు ఏమనుకుంటున్నారు? అనే దానిపై ఈ సర్వే నిర్వహించారు.. ఇక, పెద్ద రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. రాజస్థాన్‌లో ఎన్డీఏ 24 సీట్లు గెలుచుకుంటుంది.. గుజరాత్‌లో ఎన్డీఏ 25 సీట్లు కైవసం చేసుకుంటుంది.. మహారాష్ట్రలో యూపీఏ 32 సీట్లలో విజయం సాధిస్తుంది.. కర్ణాటకలో ఎన్డీఏ 17 సీట్లు, యూపీఏ 10 సీట్లు గెలుచుకుంటాయని.. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.