PM Modi Mother Hiraba: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని యుఎన్ మెహతా ఆసుపత్రి వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. తల్లి అనారోగ్యం కారణంగా ప్రధాని అహ్మదాబాద్ వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరమంతటా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన ప్రధాని మోడీ తన తల్లిని కలిసి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ.. ఈ ఏడాది జూన్ లో వందో వడిలోకి అడుగుపెట్టారు.
Read also: Rohit Reddy: రోహిత్ రెడ్డి పిటిషన్ జనవరికి వాయిదా..
ఆమె 18 జూన్ 1923న జన్మించింది. హీరాబా పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీ గాంధీనగర్‌లోని తన తమ్ముడు పంకజ్ మోడీ నివాసానికి వెళ్లి తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన 100వ పుట్టినరోజు సందర్భంగా.. తన తల్లి ఆశీస్సులు తీసుకున్నానని మోడీ ట్వీట్ చేశారు. దాదాపు అరగంట సేపు తల్లితో ముచ్చటించిన మోడీ అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. దానిని తన తల్లికి అంకితమిస్తూ బ్లాగ్ రాశారు. అమ్మ గొప్పతనాన్ని వివరిస్తూ.. అమ్మ అంటే ఒక్క పదం కాదు.. ఎన్నో భావోద్వేగాలతో నిండి ఉంటుందని అందులో వివరించారు.
Read also: Rewind 2022: ఈ ఏడాది రూ.100 కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన తెలుగు సినిమాలు
మరోవైపు నరేంద్ర మోడీ సోదరుడి బెంజ్ కారు మంగళవారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ దామోదర్ దాస్ మోడీ, ఆయన కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్‌లో చోటుచేసుకుంది.
ప్రపంచంలో నివాసయోగ్యమైన టాప్-10 నగరాలు ఇవే..