Site icon NTV Telugu

మంత్రి ప్ర‌క‌ట‌నః ఎక్కుమంది పిల్ల‌ల్ని కంటే… ల‌క్ష బ‌హుమానం…

దేశంలో జ‌నాభ ఇప్ప‌టికే 130 కోట్ల‌కు పైగా ఉన్న‌ది.  జ‌నాభాను నియంత్రించేందుకు ప్ర‌భుత్వాలు అనేక చర్య‌లు తీసుకుంటున్నాయి.  ఇటీవ‌లే ఒక్క‌రు కాదు, ఇద్ద‌రు లేదా ముగ్గురు పిల్ల‌ల్ని క‌నాల‌ని చైనా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  యూర‌ప్‌లోని కొన్ని దేశాలు కూడా పిల్ల‌ల్ని క‌నాల‌ని ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి.  అయితే, ఇండియాలోని ఓ రాష్ట్ర‌మంత్రికూడా ఇలాంటి ప్ర‌క‌ట‌న చేసి అంద‌రికి షాకిచ్చాడు.  

Read: కూతురికి సోనూసూద్ పేరు పెట్టుకున్న దంపతులు

ఎక్కువ‌మంది పిల్ల‌ల్ని క‌నాల‌ని, ఎక్కువ‌మంది పిల్ల‌ల్ని కంటే వారికి ల‌క్ష‌రూపాయ‌ల బ‌హుమానం అందిస్తామ‌ని మిజోరాం రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాబ‌ర్ట్ రోమ‌వియా పేర్కొన్నాడు.  మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.  దీనిపై మంత్రి వివ‌ర‌ణ ఇచ్చారు.  దేశంలో మిజో జ‌నాభ చాలా త‌క్కువ‌గా ఉంద‌ని, త‌న నియోజ‌క వ‌ర్గంలో ఎక్కువ‌మంది పిల్ల‌ల్ని క‌నే వారికి ల‌క్ష రూపాయ‌ల బ‌హుమానం ఇస్తాన‌ని చెప్పారు. ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి ఈ డబ్బు ఇవ్వ‌డం లేద‌ని, త‌న కుమారుడి కంపెనీ నుంచి వ‌చ్చిన లాభాల్లోనుంచే బ‌హుమానం అందిస్తాన‌ని చెప్పారు. 

Exit mobile version