తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయిదు రాష్ట్రాల్లో ఒక్కొ తేదీన ఒక్కొ రాష్ట్రానికి ఎన్నికలు జరగగా.. ఓట్ల లెక్కింపు తేదీని మాత్రం డిసెంబర్ 3న నిర్ణయించింది సెంట్రల్ ఎన్నికల కమిషన్. ఈ మేరకు అంత సిద్ధం అవుతుండగా ఈశాన్య రాష్ట్రం మిజోరం తేదీని మాత్రం సవరిస్తూ తాజాగా ఎలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. మిజోరం రాష్ట్రం ఓట్ల లెక్కింపు తేదీలో మార్పు చేసినట్టు ఈ ప్రకటనలో పేర్కొంది.
Also Read: Viral Video: మేనకోడలు పెళ్లి.. కట్టలు కట్టలుగా డబ్బుల కుప్ప.. వీడియో వైరల్
3వ తేదిన కాకుండా 4వ తేదీకి పొడగించినట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటిచింది. మిజోరం ప్రజల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. కాగా మిచోరం ప్రజలు తమ రాష్ట్రంలో 3వ తేదీన కాకుండా 4వ తేదిన ఓట్ల లెక్కింపు నిర్వహించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి వినతి పత్రం అందజేశారు. వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఈసీ 3వ తేదీకి బదులుగా 4వ తేదీకి లెక్కించాలని నిర్ణయించింది. అయితే మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 3వ తేదీనే ఓట్ల లెక్కింపు జరగనుందని ఈ సందర్భంగా ఈసీ పేర్కొంది. కాగా మిజోరం రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 9న ఒకే విడుతలో పోలింగ్ నిర్వహించిన విషయం విదితమే.
Also Read: Telangana Exit Polls 2023: ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్.. తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం
