Site icon NTV Telugu

Earthquake: గుజరాత్‌లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.4గా నమోదు

Earthquakebihar

Earthquakebihar

ఉత్తర గుజరాత్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.4గా నమోదైంది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Virat Kohli: హాట్ బ్యూటీ ఫొటోకి లైక్.. నెట్టింటా రచ్చ.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ

శనివారం తెల్లవారుజామున ఉత్తర గుజరాత్‌లో 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ (ISR) తెలిపింది. జిల్లా అధికారుల ప్రకారం.. ప్రాణనష్టం గానీ ఆస్తి నష్టం జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు. బనస్కాంత జిల్లాలోని వావ్ సమీపంలో భూకంప కేంద్రం తెల్లవారుజామున 3.35 గంటలకు నమోదైందని ISR తన నివేదికలో తెలిపింది. గాంధీనగర్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ వావ్ నుంచి తూర్పు-ఈశాన్య దూరంలో 4.9 కి.మీ లోతులో భూకంపం నమోదైందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Crime News: విశాఖలో కలకలం రేపుతున్న గుర్తు తెలియని మృతదేహలు..

Exit mobile version