NTV Telugu Site icon

దారుణంః రూ.80 వేల‌కు కోడ‌లిని అమ్మ‌కానికి పెట్టిన మామ‌…

యూపీలో ఓ మామ త‌న కోడ‌లిని రూ.80వేల రూపాయ‌ల‌కు అమ్మ‌కానికి పెట్టాడు.  విష‌యం తెలుసుకున్న బాధితురాలి భ‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు మామతో స‌హా నిందితుల‌ను ప‌ట్టుకున్నారు.  ఈ సంఘ‌ట‌న బారాబంకీ జిల్లాలోని మ‌ల్లాపూర్ గ్రామంలో జ‌రిగింది.  గుజ‌రాత్‌కు చెందిన ప‌లువురి వ‌ద్ద వ‌స్తువుల‌ను కొనుగోలు చేసిన మామ చంద్ర‌రామ్ దానికి బ‌దులుగా త‌న కోడ‌లిని అమ్మ‌కానికి ఉంచారు.  అనంత‌రం కోడ‌లిని తీసుకొస్తాన‌ని, రైల్వే స్టేష‌న్లో సిద్దంగా ఉండాల‌ని చంద్ర‌రామ్ చెప్పిన‌ట్టు పోలీసులు పేర్కోన్నారు.  అయితే, బాధితురాలి భ‌ర్త ఫిర్యాదు మేర‌కు స్టేష‌న్లో ఉన్న 8 మందిని నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఇందులో ముగ్గురు మ‌హిళ‌లు కూడా ఉన్నారు.  ఇలా కొనుగోలు చేసిన మ‌హిళ‌ల‌ను వివిధ ప్రాంతాల‌కు పంపించి సొమ్ము చేసుకుంటుంటారు.  ప్ర‌స్తుతం ప్ర‌ధాన నిందితుడైన చంద్ర‌రామ్ ప‌రారీలో ఉన్నాడు.