ప్రముఖ సినీనటుడు నాజర్ సతీమణి కమీలా మక్కల్ నీదిమయ్యం పార్టీకి రాజీనామా చేశారు. కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో కమీలా నాజర్ సౌత్ చెన్నై నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆమెకు టికెట్ దక్కలేదు. ఈ కారణంగానే ఆమె పార్టీ వ్యవహారాలకు దూరమైనట్లు తెలుస్తోంది. కమల్‌హాసన్ పార్టీని ప్రారంభంలోనే చేరిన ఆమెను చెన్నై జోన్ కార్యదర్శిగా నియమించారు. తాజాగా కమీలా వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేశారు. కమీలా నాజర్ రాజీనామాను ఆమోదించినట్లు పార్టీ ప్రధాన కార్యాలయం ప్రధాన కార్యదర్శి సంతోష్ బాబు ప్రకటించారు.
కమల్ హాసన్ పార్టీకి నాజర్ భార్య రాజీనామా
