NTV Telugu Site icon

26/11 Mumbai Attacks: పోలీస్ త్యాగానికి గుర్తుగా ఊరి పేరు మార్పు

Mumbai Attacks

Mumbai Attacks

26/11 Mumbai Attacks: ముంబైలో జరిగిన 26/11 దాడుల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. 2008లో ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడి చేయగానే స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్ఆర్‌పీఎఫ్) కానిస్టేబుల్ రాహుల్ షిండే అందులోకి వెళ్లారు. అయితే ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ శరీరంలోకి చొచ్చుకెళ్లడంతో రాహుల్ షిండే మరణించారు. ఈ మేరకు ప్రాణాలు అర్పించిన ఆయన పేరును ఓ గ్రామానికి పెట్టారు. ఆయన త్యాగానికి గుర్తుగా రాహుల్ స్వగ్రామం సోలాపుర్ జిల్లా ‘సుల్తాన్‌పుర్’ గ్రామానికి ‘రాహుల్ నగర్’ అని పేరు మార్చాలని గ్రామస్థులు నిర్ణయించారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Read Also: Stuart Broad: పెళ్లికి ముందే తండ్రి అయిన ఇంగ్లండ్ క్రికెటర్

మహారాష్ట్రలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో 600 ఇళ్లు ఉంటాయి. సుమారు వెయ్యి మంది జనాభా ఈ గ్రామంలో నివసిస్తున్నారు. గత 26 సంవత్సరాలలో ఉగ్రవాదులతో పోరాడుతూ తన ప్రాణాలను అర్పించిన స్థానిక నివాసితుల జ్ఞాపకార్థం తమ గ్రామం పేరు మార్చాలని ప్రజలు నిర్ణయించడంతో త్వరలో సుల్తాన్‌పూర్ గ్రామం రాహుల్ నగర్‌గా మారనుంది. ఇప్పటికే రాహుల్ షిండే మరణానంతరం కేంద్ర ప్రభుత్వం ఆయన త్యాగానికి గుర్తుగా రాష్ట్రపతి పోలీస్ పతాకాన్ని ప్రదానం చేసింది. తాజాగా తమ గ్రామం పేరు మార్పునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని.. తాము అధికారుల ప్రకటన కోసం వేచి చూస్తున్నామని దివంగత రాహుల్ షిండే తండ్రి సుభాష్ విష్ణు షిండే మీడియాకు తెలియజేశారు.