మహారాష్ట్ర డొంబివలిలో కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తకు బీజేపీ కార్యకర్తలు చీరకట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజకీయంగా ఈ ఘటన పెద్ద దుమారం లేపుతోంది..
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉల్హాస్‌నగర్‌కు చెందిన ప్రకాశ్ పగరే(73) ఫేస్‌బుక్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎరుపు రంగు చీరకట్టుకున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫొటో పోస్ట్ చేశాడు. దీన్ని బీజేపీ లీడర్స్ అవమానంగా భావించి.. అతను ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా పట్టుకున్నారు. బలవంతంగా ఐదు వేల రూపాయల విలువైన ఎర్ర చీరను కట్టి అవమానించారు. నీరసంగా ఉండటంతో ఎదిరించలేని పగరే.. నిరసన వ్యక్తం చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో రాజకీయంగా దుమారం రేగింది. దీనికి ఎస్సీ, ఎస్టీలకు జరిగిన అవమానంగా భావించి కులం రంగు పులిమే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నప్పటికి.. బీజేపీ నాయకులు మాత్రం తమ తప్పేమి లేదన్నట్టు భావిస్తున్నారు.
Political : కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తకు చీర కట్టిన బీజేపీ కార్యకర్తలు..
- మహారాష్ట్ర డొంబివలిలో జరిగిన ఘటన
- చర్చనీయాంశంగా మారిన ఘటన

Untitled Design (12)