NTV Telugu Site icon

Liquor Policy Scam: అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్.. సెప్టెంబర్ 11 వరకు కస్టడీ పొడిగింపు..!

Kejriwal

Kejriwal

Liquor Policy Scam: ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబై దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు దుర్గేష్‌ పాఠక్‌లకు సమన్లను జారీ చేసింది. అలాగే, ఈ కేసు సెప్టెంబర్‌ 11వ తేదీన విచారణ జరుగనుంది. ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌ను రిలీజ్ చేస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిన్న (సోమవారం) ఆయనకు కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది.

Read Also: Help To The Flood Victims: వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రండి.. సీఎం పిలుపు

అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21వ తేదీన ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) అరెస్టు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో జూన్‌ 20న ట్రయల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేయగా.. ఆ బెయిల్‌ పై స్టే ఇస్తూ.. ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. జులై 14వ తేదీన ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ను ఇవ్వగా.. సుప్రీంకోర్టును ఆశ్రయించే ముందే సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం సీబీఐ కేసులో అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్‌ కస్టడీపై తిహార్‌ జైలులో ఉండిపోయారు.

Show comments