NTV Telugu Site icon

Rajasthan No Beard Culture: మీకు గడ్డం ఉందా.. అయితే మీరు పెళ్లికి అర్హులు కారు

Beard Marriage Issue

Beard Marriage Issue

Kumawat Community Conditions On Bride Beard: ఒకప్పుడు క్లీన్ షేవ్‌తో కనిపించే యువకులు.. ఇప్పుడు భారీగా గడ్డాలు పెంచేస్తున్నారు. ఎందుకంటే, ఇప్పుడు గడ్డం పెంచడం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. సర్వేలు సైతం గడ్డం పెంచిన వారే అట్రాక్టివ్‌గా కనిపిస్తారని చెప్పడంతో.. యువకులందరూ గడ్డం పెంచడాన్నే ఇష్టపడుతున్నారు. ఆ గడ్డంతో రకరకాల ప్రయోగాలూ చేస్తున్నారు. అయితే.. రాజస్థాన్‌లో ఓ గ్రామంలో మాత్రం ఈ ట్రెండ్ వర్కౌట్ అవ్వదు. ఒకవేళ కాదని ఎవరైనా గడ్డం పెంచితే మాత్రం.. వారిని పెళ్లికి అనర్హులుగా ప్రకటిస్తున్నారు. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో ఈ విచిత్ర సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Female Thief : ఓ సారి అంటే వదిలేశారు కానీ.. మళ్లీ చేస్తే ఊరుకుంటారా తల్లీ

ఆ గ్రామంలో కుమావత్ సమాజ్ వర్గానికి చెందిన వారు మే 5వ తేదీన సామూహిక వివాహ వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఇప్పటివరకు 11 జంటలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అయితే.. ఈ వర్గం వారు, గ్రామ పెద్దలతో కలిసి ఇటీవల ఒక మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్లు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికి వరుడు క్లీన్ షేవ్‌లో మాత్రమే కనిపించాలని కొత్త నిబంధనని తీసుకొచ్చారు. ఒకవేళ క్లీన్ షేవ్ చేసుకోకపోతే మాత్రం.. పెళ్లికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయానికి జైపూర్, టోంక్, సవాయి మాధోపూర్ ప్రజలు సైతం మద్దతు తెలిపారు. ఈ మధ్యకాలంలో యువత పోకడలు మరీ విడ్డూరంగా ఉన్నాయని.. వేషధారణ చిత్రవిచిత్రంగా ఉంటోందని.. చివరికి పెళ్లిల్లో కూడా సాంప్రదాయాలు పాటించడం లేదని గ్రామ పెద్దలు చెబుతున్నారు. తమ సాంప్రదాయం ప్రకారం.. వరుడు క్లీన్ షేవ్‌తో ఉండాలని వాళ్లు పేర్కొంటున్నారు.

Bride Cancel Marriage: కట్నం సరిపోలేదని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు

కానీ.. ప్రస్తుత యువత కళ్యాణ మండపాల్లో కూడా పెద్ద పెద్ద గడ్డాలతో కనిపిస్తున్నారని, ఇది తమ సాంప్రదాయానికి పూర్తి విరుద్ధమని గ్రామపెద్దలు మండిపడ్డారు. అందుకే.. గడ్డం ఉండకూడదన్న నిర్ణయాన్ని కుమావత్ కమ్యూనిటీ నిర్ణయం తీసుకుంది. ఇదే నిర్ణయాన్ని పాలిలోని ఖేడా గ్రామ సొసైటీ 8 నెలల క్రితమే తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి గ్రామస్తులు మద్దతు తెలుపుతుంటే.. యువకులు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుత హైటెక్ యుగంలోనూ ఇలాంటి విచిత్ర పద్ధతులేంటని ప్రశ్నించారు. లుక్స్ పరంగా అందరికీ తమదైన స్వేచ్ఛ ఉంటుందని, దీనిపై కూడా ఆంక్షలు విధించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.

Show comments