NTV Telugu Site icon

వ్యాక్సినేష‌న్‌.. విదేశాలకు వెళ్లే వారికి ప్రాధాన్యం…

vaccination kerala

క‌రోనాకు చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్‌.. ప్రాధాన్య‌త‌ల‌ను బ‌ట్టి ఆయా ప్ర‌భుత్వాలు వ్యాక్సినేష‌న్ నిబంధ‌న‌లు మారుస్తూ వ‌స్తున్నాయి.. తాజాగా, కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతుండ‌గా.. అందులో.. చదువు మరియు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారికి ప్రాధాన్యత జాబితాలో చేర్చేందుకు నిర్ణ‌యించింది కేర‌ళ ప్ర‌భుత్వం.. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్ల‌డించారు.. వివిధ ప్రభుత్వ విభాగాల క్షేత్రస్థాయి సిబ్బందిని, హయ్యర్ సెకండరీ పరీక్షలకు కేటాయించిన ఉపాధ్యాయులను కూడా ప్రాధాన్యత జాబితాలో చేర్చామ‌ని తెలిపారు. కాగా, క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో ఆది నుంచి కేర‌ళ ప్ర‌భుత్వం అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిస్తోంది.. చివ‌ర‌కు ఆక్సిజ‌న్ కొర‌త‌తో దేశం మొత్తం అల్లాడుతున్న స‌మ‌యంలోనూ.. ఆక్సిజ‌న్ ప్లాంట్లు ఏర్పాటుచేసి ప్రాణాలు నిలిపింది.