NTV Telugu Site icon

Kangana Ranaut: రేప్, మర్డర్ చేసినా ఓకేనా.? కుల్విందర్‌ కౌర్‌కి మద్దతునివ్వడంపై ఫైర్..

Kangana

Kangana

Kangana Ranaut: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్ఎఫ్ కానిస్టెబుల్ కుల్విందర్ కౌర్ దాడి చేయడం సంచలనంగా మారింది. గురువారం చండీగఢ్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లే క్రమంలో కంగనాని కుల్విందర్ కౌర్ చెంపపై కొట్టారు. ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2020లో రైతుల ఉద్యమాన్ని అవహేళన చేస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలకు ప్రతిగానే తాను దాడి చేసినట్లు కుల్విందర్ చెప్పింది. ఈ ఘటనలో ఉన్నతాధికారులు ఆమెని సస్పెండ్ చేసి, విచారణ కోసం ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేశారు.

Read Also: Kodali Nani and Perni Nani: దాడులకు గురైనవారి ఇళ్లకు వెళ్లి అండగా నిలుస్తాం.. పోలీసులపై హైకోర్టులో కేసులు వేస్తాం..

ఇదిలా ఉంటే తనపై దాడి జరిగిన తర్వాత బాలీవుడ్ స్పందించకపోవడంపై ఆమె ట్వీట్ చేసి, ఆ తర్వాత డిలీట్ చేశారు. తాజాగా కంగనా ఈరోజు మరోసారి విరుచుకుపడ్డారు. ‘‘ఒక వ్యక్తి అనుమతి లేకుండా తన శరీరాన్ని తాకడాన్ని సమర్థించే వీరందరూ అత్యాచారం/హత్యలకు కూడా మద్దతు ఇస్తారు, ఇలాంటి వారు తమ మానసిక స్థితిని పరిశీలించుకోవాలి, వీరు యోగ, ధ్యానం చేయాలి, లేదంటే జీవితం చేదుగా మారుతుంది, దయచేసి పగ, ద్వేషం, అసూయతో ఉండకండి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు నేరస్తుల వైపు ఉంటే, దేశంలో అన్ని చట్టాలను ఉల్లంఘించేవారికి బలమైన భావోద్వేగ ప్రేరణ ఉంటుందని ఆమె అన్నారు.

కంగనాపై దాడి చేసిన కుల్విందర్ కౌర్‌ని మెచ్చుకుంటూ పలువురు సెలబ్రెటీలు ట్వీట్స్ చేస్తున్నారు. కొందరైనే కుల్విందర్‌కి ఉద్యోగం ఇస్తామంటూ ఆఫర్ కూడా చేశారు. మరికొందరు ఆమె బయోపిక్ తీస్తామంటూ ట్వీట్స్ చేశారు. మరోవైపు రైతు సంఘాలు కుల్విందర్‌కి మద్దతు ప్రకటించాయి. ఈ నెల 9న న్యాయ్ ర్యాలీ చేపట్టనున్నట్లు రైతు నేతలు చెప్పారు. విమానాశ్రయంలో ఈ ఘటనకు దారి తీసిన సంఘటనల క్రమంపై సరైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారుల్ని రైతు సంఘాలు కోరుతున్నాయి.