Justice Abhijit Gangopadhyay Says Hire Bulldozers From Yog Govt To Demolish Illegal Constructions: అక్రమ నిర్మాణాలపై కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ సంచలన ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. బెదిరింపులకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని కూడా ఇచ్చారు. శుక్రవారం మణిక్తలా పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కేసును జస్టిస్ గంగోపాధ్యాయ ధర్మాసనం విచారించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా చేసిన ప్రసంగాన్ని విన్న జస్టిస్ గంగోపాధ్యాయ.. అవసరమైన అక్రమ నిర్మాణాల్ని కూల్చేందుకు యోగి ప్రభుత్వం నుంచి బుల్డోజర్లను అద్దెకు తీసుకోవచ్చని చెప్పారు. కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ అధికార పరిధిలోని అక్రమ నిర్మాణం గురించి న్యాయవాది తన వాదనను వినిపించినప్పుడు.. న్యాయమూర్తి ఈ బుల్డోజర్ల వ్యాఖ్య చేశారు.
Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌కి బాంబు బెదిరింపు.. తీరా చూస్తే..
ఇదే సమయంలో.. గూండాయిజానికి వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని ఇస్తూ, ‘యాంటీ గూన్ వింగ్’ విభాగంపై న్యాయమూర్తి ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఎలాంటి వేధింపులను సహించేది లేదు.. పోకిరీలను ఎలా క్రమశిక్షణలో పెట్టాలో నాకు తెలుసు.. అలాగే పోకిరీలను ఎలా కట్టడి చేయాలో కోల్‌కతా పోలీస్‌లోని ‘గూండా నిరోధక శాఖ’ అధికారులకు కూడా బాగా తెలుసు’’ అని జస్టిస్ చెప్పుకొచ్చారు. పోలీసులు, మున్సిపాలిటీ వాళ్లు ఎంత ఒత్తిళ్లతో పని చేయాల్సి వస్తుందో తనకు తెలుసని.. అయితే ఈ కేసులో ఇప్పుడే తీర్పు ఇవ్వలేమని, ఆగస్టు 4వ తేదీన తదుపరి విచారణ సాగుతుందని చెప్తూ వాయిదా వేశారు. కాగా.. అక్రమ నిర్మాణాలపై యోగి ఆమధ్య బుల్డోజర్లతో కూల్చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై అప్పట్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు ఆ మాటల్ని జస్టిస్ గంగోపాధ్యాయ రిపీట్ చేయడంతో, ఈ బుల్డోజర్ల అంశం మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.