Bengaluru Techie: బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ సూసైడ్ కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భరణం ఇవ్వకపోతే చచ్చిపోవచ్చని కోర్టులో న్యాయమూర్తి ముందే భార్య అతడిని అనడం.. దానికి జడ్జ్ నవ్వడం అతుల్ సుభాష్‌ను తీవ్రంగా బాధించిందని అతడి బంధువులు తెలిపారు. ఈ సందర్భంగా నా సోదరుడికి న్యాయం జరగాలని నేను డిమాండ్ చేస్తున్నాను.. పురుషులకు కూడా ఈ దేశంలో చట్టబద్దమైన న్యాయం అందించాలని కోరారు. ఇక, న్యాయమూర్తిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అతుల్ సోదరుడు వేడుకున్నాడు. ఇలాంటి అవినీతి కొనసాగితే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించాడు. కోర్టులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని చెప్పుకొచ్చాడు.
Read Also: Siddharth-Allu Arjun: అల్లు అర్జున్‌తో ఏదైనా సమస్యా?.. సిద్ధార్థ్ సమాధానం ఇదే!
ఇక, తాము ఏటీఎం యంత్రాల వలే మారిపోతామని అనుమానంతో పెళ్లిళ్లు అంటేనే పురుషులు భయపడే పరిస్థితికి దారి తీసిందని బెంగళూరు టెకీ సోదరుడు పేర్కొన్నాడు. తన సోదరుడు విడాకుల కేసుకు సంబంధించి అతుల్ సుభాష్ 40 సార్లు బెంగళూరు నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్‌కు తిరిగాడని ఆయన వెల్లడించారు. మరోవైపు, అతుల్ సుభాష్ భార్య నిఖిత సింఘానియా కూడా ప్రత్యారోపణలు చేసింది. సుభాష్ తల్లి అదనపు కట్నం కోసం వేధించింది.. అలాగే, నా భర్త రోజు మద్యం తాగి వచ్చి నన్ను కొట్టేవాడని ఆరోపించింది. అసలు నన్ను ఒక మనిషిలా చూసేవాడు కాదు.. నన్ను బెదిరించి నా జీతం మొత్తం తన ఖాతాలోకి బదలాయించుకొనేవాడని నిఖిత చెప్పుకొచ్చింది.