Student Protest: జంతర్ మంతర్‌కు సాహో.. జార్ఖండ్ ఉద్యమానికి నో నో! CJP, బాలీవుడ్, కాంగ్రెస్ స్పందన ఎక్కడ?

  • జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి స్పందన కరువు..
  • సీజేపీ, కాంగ్రెస్, సోషల్ మీడియా మౌనం..
  • మూగబోయిన బాలీవుడ్ గొంతుకలు..
  • రెండు విద్యార్థి ఉద్యమాలే, కానీ ఈ తేడాలెందుకు..
Jharkhand Exam Protest

Jharkhand Exam Protest

Student Protest:  జార్ఖండ్‌లో విద్యార్థి ఉద్యమం కొనసాగుతోంది. ఉద్యమ నేత దేవేంద్ర నాథ్ మహతో గత 15 రోజులగా ఆమరణ నిరాహార దీక్ష చేస్కతున్నారు. అయినప్పటికీ జార్ఖండ్‌లోని జేఎంఎం+కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను తీర్చడం లేదు. రాంచీలో జూలై చివరి నుంచి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(JSSC) ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఉద్యమాన్ని చేపట్టారు. ఈ పరీక్షల్ని రద్దు చేయడం, పరీక్షల్ని మళ్లీ నిర్వహించడం, పేపర్ లీక్-కాపీయింగ్‌పై దర్యాప్తు, బాధ్యులపై కఠిన చర్యలు, సంస్థాగత సంస్కరణలు, సీబీఐ దర్యాప్తును కోరుతున్నారు. అయితే, ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లలో కొన్నింటికి ఒప్పుకోవడం లేదు.

జంతర్ మంతర్‌కు సాహో, జార్ఖండ్ ఉద్యమానికి నోనో..

జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి తగినంత మద్దతు రావడం లేదు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్‌కు వచ్చిన మద్దతులో సగం మద్దతు కూడా లేదు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గొంతుకలు, జార్ఖండ్‌లో జేఎంఎం+కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు.

ముఖ్యంగా నీట్ ఉద్యమానికి సారధ్యం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ప్రధాన వ్యక్తులు రాంచీకి వెళ్లలేదు. కేవలం మీడియాలో ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇస్తూ తాము మద్దతు తెలుపుతున్నామనే మాటలు మాత్రమే చెప్పారు. విద్యార్థుల సమస్యలకు మేము అండగా నిలుస్తామని చెప్పిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు జార్ఖండ్ విద్యార్థి ఉద్యమంపై పెద్దగా స్పందించడం లేదు. ఆగస్టు 10న జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనన్లు, లాఠీ చార్జ్ చేశారు.

జంతర్ మంతర్ వద్ద లాఠీ ఛార్జ్ చేసినందరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రాజీనామా చేయాలని కోరిన కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు, జార్ఖండ్ ఉద్యమంపై మాత్రం కంటితుడుపు వ్యాఖ్యలకే పరిమితమయ్యాయి. బీజేపీ అధికారంలో ఉంటే ఒకలా, తాము అధికారంలో ఉంటే మరోలా వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కన్నా రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం కనిపిస్తోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ కాంగ్రెస్, ఆప్, సమాజ్‌వాదీ పార్టీలు మాత్రం జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి రాజీనామాను కోరకపోవడం గమనార్హం.

బాలీవుడ్ మౌనం..

నీట్ పరీక్ష వివాదంపై జంతర్ మంతర్‌కు వచ్చి పలువురు స్వచ్ఛంద సేవా కార్యకర్తలు, బాలీవుడ్ నటులు రాంచీకి వెళ్లలేదు. కేవలం సెలెక్టివ్‌గా మాత్రమే స్పందిస్తారని అర్థమవుతోంది. నసీరుద్దీన్ షా, ప్రకాశ్ రాజ్, స్వరా భాస్కర్, సోనాక్షి సిన్హా వంటి వారు జార్ఖండ్ ఉద్యమంపై పెద్దగా పెదవి విప్పడం లేదు.  ఒకవేళ మాట్లాడిన ఆ వైఖరి జంతర్ మంతర్‌లా బలంగా లేదని చాలా మంది భావిస్తున్నారు. అలియా భట్, కరీనా కపూర్ ఖాన్, వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్, షబానా అజ్మీ వంటి వారు జంతర్ మంతర్ నిరసనలకు మద్దతు తెలిపారు. కానీ రాంచీలో జరుగుతున్న ఉద్యమం గురించి పెదవి విప్పడం లేదు.

సోషల్ మీడియా అటెన్షన్ లేదు..

నీట్ ఉద్యమ సమయంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారామ్‌లలో జంతర్ మంతర్ ఉద్యమానికి, సీజేపీకి తెగ హైప్ ఇచ్చారు. మరి రాంచీలో జరుగుతున్న ఉద్యమం సోషల్ మీడియాలో చూద్దామన్న కనిపించడం లేదు. జంతర్ మంతర్‌కు ఒకలా, జార్ఖండ్ ఉద్యమానికి మరోలా సోషల్ మీడియా అటెన్షన్ రావడం గమనార్హం.