IRCTC contractor fined Rs 1 lakh by Railways for charging Rs 5 extra on a water bottle: రైల్వే స్టేషన్‌లో చాలామంది కాంట్రాక్టర్లు నియమ నిబంధనలకు లోబడి.. ఎంఆర్పీ ధరలకే వస్తువుల్ని విక్రయిస్తుంటారు. కానీ.. కొందరు మాత్రం నియమాలకి విరుద్ధంగా ఎక్కువ ధరలకు అమ్ముతుంటారు. ‘ఇదేంటని’ ప్రశ్నిస్తే.. ‘కొంటే కొను, లేకపోతే లేదు’ అంటూ బెదిరిస్తారు కూడా! రైల్వే స్టేషన్లలో ప్రత్యామ్నాయం ఉండదు కాబట్టి.. వాళ్లు చెప్పిన రేటుకే కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ విషయాన్ని దాదాపు ప్రతిఒక్కరూ బేఖాతరు చేస్తారు. ‘రూ. 5 ఎక్కువ ఇస్తే పోయేదేముందిలే’ అని లైట్ తీసుకుంటారు. కానీ.. ఓ ప్రయాణికుడు మాత్రం దీనిని సీరియస్‌గా తీసుకున్నాడు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకే వాటర్ బాటిల్‌ని అమ్మినందుకు.. అధికారులకి ఫిర్యాదు చేశాడు. దీంతో.. ఆ రైల్వే కాంట్రాక్టర్ భారీ మొత్తంలో జరిమానా కట్టాల్సి వచ్చింది.
Hi Mum Scam: ఆస్ట్రేలియాలో ‘హై మమ్ స్కామ్’.. వేల సంఖ్యలో ప్రజలు బలి
ఆ వివరాల్లోకి వెళ్తే.. హర్యానాకు చెందిన శివం భట్ అనే ఓ ప్రయాణికుడు ఇటీవల లక్నో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేశాడు. చండీగఢ్ నుంచి షాజహాన్‌పూర్‌కు వెళ్తున్న ఇతను.. మార్గమధ్యంలో దాహమేసి, ఒక వాటర్ బాటిల్ కొన్నాడు. అయితే.. ఆ బాటిల్‌పై ఎంఆర్పీ రూ. 15 ఉండగా, రైల్వే కాంట్రాక్టర్ మాత్రం రూ. 20కి విక్రయిస్తున్నాడు. దీనిపై శివం ప్రశ్నించగా.. ‘‘కావాలంటే తీసుకో, లేదంటే వదిలెయ్’’ అన్నట్లు అతడు జవాబిచ్చాడు. దీంతో.. శివం అతడు అడిగినంత డబ్బు ఇచ్చి, బాటిల్ తీసుకున్నాడు. ఇక్కడే శివం ఒక తెలివైన పని చేశాడు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి.. రైల్వే ఉన్నతాధికారులకు పంపించాడు. అలాగే.. సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అవ్వడం, విషయం ఉన్నతాధికారులకి చేరడంతో.. వాళ్లు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. ఆ రైల్వే కాంట్రాక్టర్‌ని అరెస్ట్ చేయడంతో.. ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరకు వాటర్ బాటిల్స్ అమ్ముతున్నందుకు రూ. లక్ష జరిమానా విధించారు.
West Bengal Strange Lights: ఆకాశంలో వింత.. స్పేస్‌షిప్ అంటూ జనాలు గిలిగింత